HomeAndhra Pradeshరాప్తాడు విద్యార్థినిపై దాడి ఘటన - బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్...

రాప్తాడు విద్యార్థినిపై దాడి ఘటన – బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

రాప్తాడు విద్యార్థినిపై దాడి ఘటన – బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం:
రాప్తాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు.అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యులతో చికిత్స అందిస్తుండగా, శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని, కుటుంబ సభ్యులను కలెక్టర్ పరామర్శించారు. అమ్మాయి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ పర్యవేక్షణ చేయాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు.దాడి చేసిన నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మల్లేశ్వరి, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RapthaduZPGirlsAttack #CollectorOAnand #AnantapurGovtHospital #StudentTreatment #SuperintendentDrMalleswari #AdministratorMallikharjunaReddy #NTRVaidyaSeva #GangadharReddy #JusticeForStudent

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments