క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడనే విమర్శలు ఎదుర్కొన్న వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తనను విమర్శించిన వారికి కౌంటర్ ఇస్తూ.. మ్యాచ్ తర్వాత తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.


