HomeAndhra Pradeshమలేరియా మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. ఆస్పత్రిలోనే మరో 57 మంది

మలేరియా మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. ఆస్పత్రిలోనే మరో 57 మంది

క్లోరిక్విన్ మాత్రలు వికటించి ఒక చిన్నారి మరణించిన దారుణ ఘటన పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో చోటుచేసుకుంది. గౌరిదేవిపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది గొల్లగుప్ప గ్రామాంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు రక్త పరీక్షలు చేయగా కొంతమందికి మలేరియా పాజిటివ్ వచ్చినట్లు నిర్థారించారు. దాంతో గ్రామంలోని జీపీఎస్ పాఠశాలకు చెందిన 27 మంది, అంగన్‌వాడీ పాఠశాలకు చెందిన 14 మంది చిన్నారులతో పాటు గ్రామస్తులకు ముందస్తు జాగ్రత్తగా క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశారు. వారిలో జీపీఎస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న మడివి జమున అనే ఏడేళ్ల చిన్నారి వాంతులు, కడుపు మంటతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments