ఏషియన్ గేమ్స్ 2026లో చైనాకు చెందిన 19 ఏళ్ల స్విమ్మర్ ఝాంగ్ ఝాన్షూవో ఆల్ టైమ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒకే ఏషియన్ గేమ్స్ ఎడిషన్‌లో 7 స్వర్ణ పతకాలు గెలుచుకున్న తొలి స్విమ్మర్‌గా చరిత్రకెక్కాడు. భారత్ సాధించిన మొత్తం 4 గోల్డ్ మెడల్స్ కంటే కూడా ఈ ఒక్క అథ్లెటే ఎక్కువ స్వర్ణాలు నెగ్గడం విశేషం. ఆసియా క్రీడల్లో ఏకంగా 37 దేశాల కంటే ఎక్కువ పసిడి పతకాలను ఈ చైనా వండర్ కిడ్ ఒక్కడే గెలుచుకోవడం గమనార్హం.


