తన ప్రియుడితో కలిసి.. కట్టుకున్న భర్తను అత్యంత హత్య చేయడమే కాదు.. అత్యంత క్రూరంగా వ్యవహరించింది. అతడి శవాన్ని ముక్కలుగా నరికి, ఇంటి బాత్రూమ్లోని నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి కాంక్రీట్తో కప్పేసింది. ఇది మీరట్ మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసు. ఈ కేసులో అతడి భార్య, ఆమె ప్రియుడ్ని దోషులుగా నిర్దారించిన కోర్టు.. ఉరిశిక్ష ఖరారు చేస్తూ బుధవారం నాడు సంచలన తీర్పును వెలువరించింది.


