
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు చెందిన రూ.39.77 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.భైరామ్‌గఢ్ పరిధిలోని బాడేపల్లి అటవీ ప్రాంతంలో భూమిలో పాతిపెట్టిన ఉక్కు పెట్టెలో ఈ నగదును గుర్తించారు.
డీఆర్జీ, స్థానిక పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


