నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న పీరియడ్ డ్రామా ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని చూసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ థియేటర్‌కు వెళ్లనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత తన అభిమాన నటుడు నాని నటించిన ఈ సినిమాను థియేటర్లోనే వీక్షించబోతున్నట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. సినిమాలో ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకర్ అన్న’ పాత్ర తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆహార్యాన్ని పోలి ఉండటం, ఇప్పటికే కేసీఆర్ మనవడు హిమాన్షు రావు థియేటర్లో ఈ చిత్రం చూడటంతో కేటీఆర్ రాక రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
బిగ్ స్క్రీన్‌పై కేసీఆర్ స్వాగ్… ‘ది ప్యారడైజ్’కి కేటీఆర్ మద్దతు, చాలాకాలం తర్వాత థియేటర్‌కి
RELATED ARTICLES


