రాగులు.. చిరుధాన్యాల్లో ముఖ్యమైన ధాన్యం. దీనిని మనం ఏదో రకంగా తీసుకోవడం వల్ల బరువుని తగ్గించుకోవడం దగ్గర్నుంచీ ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి. రాగుల్లో కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. రాగి పిండిని మనం తీసుకున్నప్పుడు ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో ఎలాంటి చిరుతిళ్ళు తినం. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ని లాభాలున్న రాగుల్ని మనం జావలా మాత్రమే కాకుండా అనేక రకాలుగా తీసుకోవచ్చు. అందులో ఒక రెసిపీ రాగి రొట్టె.
రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది గ్లూటెన్ ఫ్రీ సూపర్ ఫుడ్. రాగుల్లో ఎక్కువగా కాల్షియంతో పాటు పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని NLM అధ్యయనం పేర్కొంది. అలాంటి రాగుల్ని మనం ఎలా అయినా మన డైట్లో యాడ్ చేసుకోవాలి. అందుకోసం ఎప్పుడు ఒకేలా జావ చేసుకుని తినకుండా రాగి రొట్టెని ట్రై చేయండి.
రాగి రొట్టె.. ఈ పేరు వినగానే గట్టిగా అప్పడంలా ఉంటుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రాగి పిండిని రొట్టెలా కాకుండా మనం సరైన విధంగా చేస్తే అవి పూరీల్లా పొంగుతాయి. చూడ్డానికే కాదు ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ రాగి రొట్టెల్ని చేయడానికి ఏయే పదార్థాలు కావాలి. వాటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఈ రొట్టెలు ఇప్పుడిప్పుడే చేస్తున్నవి కాదు. మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పట్నుంచో చేసినవే. అప్పట్లో రాగులతో రాగి ముద్ద, జావ, రొట్టెలు ఇలా ఎన్నో వెరైటీస్ చేసేవారు. నేడు ఈ రొట్టెల్ని చాలా మంది సెలబ్రిటీలు ఇష్టపడుతున్నారు. కారణం ఇందులోని పోషకాలు. ఇందులోని కాల్షియం ఎముకల్ని దృఢంగా చేసి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల్ని తగ్గించగా ఇందులో తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్, కాంప్లెక్ష్ కార్బోహైడ్రేట్స్ ఉండగా జీర్ణమవ్వడాన్ని మెల్లిగా చేసి ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా పొట్ట నిండుతుంది. ఈ కారణంగా ఎక్కువగా తినరు. రాగి పిండిలో ఫైటేట్స్, పాలీఫెనాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించి చెడు కొలెస్ట్రాల్‌ని మ్యానేజ్ చేస్తాయి.


