నవధాన్యాల్లో ఒకటైన ఉలవలు పోషకాల ఖజానా. ఇందులో ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు విపరీతంగా ఉంటాయి. విటమిన్లు, మైక్రో న్యూట్రియెంట్లు నిండి ఉన్న ఈ చిన్న గింజలు.. మన శరీరంలో చెడు కొవ్వును మైనంలా కరిగించడమే కాకుండా, కిడ్నీల్లో రాళ్లను చిధ్రం చేసి బయటకు పంపే నేచురల్ డీటాక్సిఫైయర్గా పనిచేస్తాయి. అందుకే ఉలవలను పప్పుగా, ఉలవచారుగా, గుగ్గిళ్లుగా తీసుకుంటుంటారు.
ముఖ్యంగా చలికాలంలో ఉలవలు తింటే శరీరానికి వేడి ఇస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే ఉలవలు కేవలం రుచికోసమే కాకుండా.. సమతుల ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఉలవలును తరచు మన డైట్లో చేర్చుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


