వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి వేదికపై జరుగుతున్న వ్యవహారం విషయంలో వైసీపీ స్పందించింది. ఈ విషయంలో షర్మిలకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లెటర్‌ను ఆ పార్టీ బయటపెట్టింది. ఆ లెటర్లో వైఎస్ జగన్ .. తన నివాసాన్ని పెళ్లి వేడుకకు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించారో తెలియజేశారు. సెక్యూరిటీ, ప్రైవసీల రీత్యా ఆ ఇంటిని ఇవ్వలేనని ఆయన చెప్పుకొచ్చారు. తన పిల్లల పెళ్లిళ్ల విషయంలో కూడా తాను ఇదే నిర్ణయం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని జరిగినా.. అంజలి జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు.
ప్రియమైన షర్మీ.. అంటూ వైఎస్ జగన్ చెల్లెలకు రాసిన లెటర్‌ను రిలీజ్ చేసిన వైసీపీ.. అసలు లేఖలో ఏముంది?
RELATED ARTICLES


