తెల్లజుట్టు వస్తే చాలా మంది ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే తెల్ల జుట్టు ఉన్నవారిని పెద్ద వయసువారిలా చూస్తుంటారు. అందుకే, చాలా మంది దీనిని కవర్ చేయడానికి డైలు, హెయిర్ కలర్స్, బ్లాక్ హెన్నా వంటివి వేసుకుంటారు. అయితే, పెద్దవారు ఇలాంటి చిట్కాలని ఫాలో అవ్వొచ్చు. కానీ, చిన్న వయసులోనే సమస్య వస్తే మాత్రం దానిని ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఫాలో అయి సమస్యని దాచిపెట్టలేం. అసలు సమస్య రావడానికి కారణాలు ఏంటి? పరిష్కారమయ్యేందుకు ఏం చేయాలో డాక్టర్ భావన పి(కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్, గెనీగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్వర్క్, లక్డీకపూల్, హైదరాబాద్) చెబుతున్నారు.


