HomeNation and Worldనేపాల్ వరదల్లో మృత్యుంజయుడు.. నాలుగు రోజులు కొండపై బిస్కెట్లు తింటూ ప్రాణాలతో బయటపడ్డ అస్సాం యువకుడు

నేపాల్ వరదల్లో మృత్యుంజయుడు.. నాలుగు రోజులు కొండపై బిస్కెట్లు తింటూ ప్రాణాలతో బయటపడ్డ అస్సాం యువకుడు

నేపాల్‌ను అతలాకుతలం చేసిన ప్రళయకర ఆకస్మిక వరదల నుంచి అస్సాంకు చెందిన పవర్ స్టేషన్ ఉద్యోగి పంకజ్ బర్మన్ అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. వరద ఉధృతికి విద్యుత్ కేంద్రం కొట్టుకుపోతుండగా.. సమీపంలోని కొండపైకి పరుగులు తీసిన ఆయన.. మరొక వంద మందితో కలసి నాలుగు రోజుల పాటు అక్కడే తలదాచుకున్నారు. కేవలం బిస్కెట్లు, మంచి నీళ్లతోనే కడుపు నింపుకుని నరకయాతన అనుభవించారు. నేపాల్ రెస్క్యూ బృందాలు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చొరవతో స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన.. తన ప్రాణస్నేహితుడు సహా మరో ఐదుగురు ఇంకా అచూకీ లభించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments