HomeTELANGANA'నేను మంత్రిగా బాగా పనిచేస్తున్నాను, నన్ను పదవిలో కొనసాగించండి'.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొండా సురేఖ విజ్ఞప్తి

‘నేను మంత్రిగా బాగా పనిచేస్తున్నాను, నన్ను పదవిలో కొనసాగించండి’.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొండా సురేఖ విజ్ఞప్తి

ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలను కలిసిన మంత్రి కొండా సురేఖ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు మిగిలిన మంత్రులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తాను మంత్రిగా బాగా పనిచేస్తున్నానని, తనను మంత్రి పదవిలో కొనసాగించాలని హైకమాండ్‌కు చెప్పినట్లు కొండా సురేఖ చెప్పారు. తాను బీసీ మహిళా నాయకురాలినైనందుకే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. కేబినెట్‌లోని ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులపై కూడా ఆరోపణలు ఉన్నాయని.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments