కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జారీ చేసిన షోకాజ్ నోటీసులకు మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా కొండా సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్యలు అని.. వాటితో తనకు సంబంధం లేదని ఆమె తేల్చేశారు. తనకు కాంగ్రెస్ అంటే గౌరవం ఉందని.. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు.


