కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన, స్వామివారి అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు. శ్రీవారి దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని తిలక్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు.


