బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఆలయానికి విచ్చేసిన కంగనా, గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఆరెంజ్ రంగు చీర ధరించి వచ్చిన కంగనా ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కంగనా రాకతో ఆలయ ప్రాంగణంలో అభిమానులు, భక్తులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు.



