జాతీయ జెండాతో నిరసన చేపట్టాలన్న సీజేపీ పిలుపు నేపథ్యంలో అభిజీత్ దీప్కే ఇంటికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. అనుమతి లేని ర్యాలీ నిర్వహించవద్దని సూచించారు. కనాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్ను 2 రోజులు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అదుపులోకి తీసుకుని 5 రోజుల న్యాయ కస్టడీకి పంపించారు. మరోవైపు.. ఎన్నికల కమిషన్ వ్యవహారంపై తమ నిరసన కొనసాగుతుందని అభిజీత్ దీప్కే ప్రకటించారు. ముంబై ఆజాద్ మైదాన్లోనూ సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది.


