మనకి ఇష్టమైన అలవాటుని మార్చుకోవడం చాలా కష్టం. అందుకోసం లేని మంచి దానికి చేర్చుకుని ఆ అలవాటుని కొనసాగిస్తాం. అలాంటి వాటిలో టీ ఒకటి. టీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. నిజమే, కానీ, సరైన విధంగా తాగితే ఎన్నో లాభాలు ఉంటాయి. అందులో తాజా అధ్యయనంలో తేలిన విషయమైతే టీ లవర్స్‌ని మరింత ఉప్పొంగేలా చేస్తుంది. అదేంటంటే రెగ్యులర్‌గా టీ తాగితే గుండె, రక్తనాళాల సమస్యల ప్రమాదం తగ్గుతుందని జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం పేర్కొంది. అందులో తెలిపిన వివరాల ప్రకారం రెగ్యులర్‌గా టీ తాగితే గుండె సమస్యల ప్రమాదం దాదాపు 11 శాతం వరకూ తగ్గిందని తేలింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


