మనం ఆలోచించకుండా చేసే కొన్ని పనులు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, దంత ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. రోజువారీ అలవాట్లు మీ నోటి ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. నోటి ఆరోగ్యం బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. లేదంటే బ్యాక్టీరియా నోటి నుంచి లోపలికి వెళ్ళి ఇతర సమస్యలకి కూడా దారితీస్తుంది. నిజానికీ దంతాల ఎనామెల్ చాలా బలంగా ఉంటుంది. ఒక్కసారి ఎనామెల్ అరిగిపోతే అది తిరిగి రాదు. దీంతో దంతాల్లో పుచ్చు ఏర్పడి సున్నితంగా మారతాయి. మనం రోజూ చేసే కొన్ని పొరపాట్లే ఎనామెల్ని బలహీనపరిచి దంతాలను పాడు చేస్తాయి. ఈ తప్పుల్ని మనలో చాలా మంది రోజూ చేస్తూనే ఉంటారు.


