గోదావరి నది అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అందాలను వీక్షించాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. నది మధ్యలోకి వెళ్లి ఒక రోజంతానో, ఒక గంట సేపో అక్కడే గడిపే అవకాశం వచ్చే.. ఇక నిజంగా మనం స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. ఆ అవకాశాన్ని పర్యాటక శాఖ త్వరలోనే కల్పించనుంది. ఒక రోజంతా ఉండాలంటే ఒక రేటు, క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం గంట ఉండేందుకు మరో రేటును పర్యాటక శాఖ ఫిక్స్ చేసింది. అనుమతులు రాగానే ఇది అమలవుతుందని అధికారులు చెబుతున్నారు.
గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!
RELATED ARTICLES


