మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రిపై క్రమశిక్షణ చర్యలపై చర్చ జరుగుతున్న వేళ.. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ముందుగా సురేఖతో సంప్రదించాలని సూచించినట్లు సమాచారం. ఇద్దరు మంత్రులు, ఓ సీనియర్ నేత కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సురేఖను కేబినెట్ నుంచి తొలగించకుండా శాఖలు మార్చే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం. ఆమెను పదవి నుంచి తప్పిస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమని.. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిష్కరించాలని నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది.


