కన్నడిగుల ఉద్యోగాల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. స్థానిక కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా.. వారిని పక్కన పెట్టినట్టు తేలితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అటువంటి సంస్థలపై రాష్ట్రం కఠిన చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు. అలాగే కన్నడిగుల హక్కులను, గౌరవాన్ని, వారికి దక్కాల్సిన అవకాశాలను ఏ కారణం చేతనైనా విస్మరించడాన్ని ప్రభుత్వం అనుమతించదని స్పష్టం చేశారు.


