AP Govt Approves For Recruitment Of 913 Asha Workers Posts: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,294 పోస్టులను భర్తీచేయగా.. తాజాగా 913 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆశా కార్యకర్తకు నెలకు గౌరవ వేతనం రూ.10వేలు కాగా .. 24 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు అర్హులు. జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా తెలియజేశారు.


