Andhra Pradesh Temperatures Above 39: ఏపీలో ఎండల తీవ్రత కనిపిస్తోంది.. వేసవికాలాన్ని తలపిస్తూ రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్న వాతావరణశాఖ అంచనాలు నిజమవుతున్నాయి. మంగళవారం ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఏకంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో పాటుగా వేడిగాలులు ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కూడా పడలేదు.. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
ఏపీలో ఎండల తీవ్రత.. ఏకంగా 39 డిగ్రీలు నమోదు, వేడి గాలులతో ఉక్కపోత.. మూడు జిల్లాల్లో పరిస్థితి దారుణం
RELATED ARTICLES


