ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో పబ్లిష్ అయిన నివేదిక హైబీపి గురించి కొన్ని ముఖ్య విషయాలని వెల్లడించింది. నివేదిక ప్రకారం, బీపిని తగ్గించడానికి సోడియంని తగ్గించడమే కాకుండా పొటాషియం తీసుకోవడం హెల్ప్ చేస్తుంది. కేవలం సోడియం కంటే, సోడియం పొటాషియం నిష్పత్తులు గుండె సంబంధ సమస్యల ఫలితాలని కచ్చితంగా అంచనా వేస్తాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి. ఎక్కువగా సోడియాన్ని తీసుకుంటే హైబీపి మాత్రమే కాకుండా, గుండె సంబంధ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి, సోడియాన్ని తగ్గిస్తూనే పొటాషియాన్ని పెంచుకోవాలని చెబుతున్నారు.


