గత నెల 30న దుబాయ్ నుంచి 174 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఫ్లైదుబాయ్ ఎయిర్లైన్స్ విమానంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాక్పిట్లో కెప్టెన్పై గొడ్డలితో దాడిచేసిన కో-పైలట్.. విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్ఛార్.. రక్తమోడుతున్నా శక్తిని కూడదీసుకుని కాక్పిట్ డోర్ను తెరిచారు. దీంతో నిందితుడ్ని ప్రయాణికులు పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనలో మరో ఇద్దరు పైలట్లను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు.


