HomeHeadlinesఅగ్నివీరులకు కేంద్రం గుడ్ న్యూస్ - నాలుగేళ్ల సర్వీస్ పై కీలక నిర్ణయం దిశగా అడుగులు

అగ్నివీరులకు కేంద్రం గుడ్ న్యూస్ – నాలుగేళ్ల సర్వీస్ పై కీలక నిర్ణయం దిశగా అడుగులు

అగ్నివీరులకు కేంద్రం గుడ్ న్యూస్ – నాలుగేళ్ల సర్వీస్ పై కీలక నిర్ణయం దిశగా అడుగులు

న్యూఢిల్లీ:
అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన మొదటి బ్యాచ్ అగ్నివీర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.శాశ్వత నియామకాలకు ఎంపికైన అగ్నివీర్లతో పాటు మరికొంత మంది సిబ్బందికి సర్వీస్ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. తొలి బ్యాచ్ నాలుగేళ్ల పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో శాశ్వత కేడర్ కోసం ఎంపిక ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ ప్రతిపాదనపై గత కొన్ని రోజులుగా రక్షణ శాఖలో పలు ఉన్నత స్థాయి సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది.

నవంబర్ 21లోగా అధికారిక ప్రకటన?
ఇంకా అధికారిక నిర్ణయం వెలువడనప్పటికీ నవంబర్ 21న మొదటి బృందం పదవీకాలం ముగిసేలోపే స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. అయితే పొడిగింపు కాలపరిమితి ఎంత అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.మూడు దళాల్లో నేవీ మొదటి బ్యాచ్ సర్వీస్ నవంబర్ 21న, ఎయిర్ ఫోర్స్ డిసెంబర్ 21న, ఆర్మీ డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసుకోనున్నాయి.

25% శాశ్వత కేడర్:
2022లో కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిబంధనల ప్రకారం ప్రతి బ్యాచ్ లో 25% మందిని పనితీరు ఆధారంగా రెగ్యులర్ సర్వీస్ లోకి తీసుకునే వెసులుబాటు ఉంది.ఇందులో భాగంగానే ఎయిర్ ఫోర్స్ తొలి ‘అగ్నివీర్ వాయు’ బ్యాచ్ లోని 2,850 మంది రిక్రూట్లలో 712 మందిని శాశ్వత కేడర్ కింద కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments