న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ (51 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (26 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో ఓ పరుగు తీసే క్రమంలో ఇద్దరు తెలుగు ఆటగాళ్లు మైదానంలో తెలుగులో మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో మన మాతృభాష వినిపిస్తుండటం చూసి తెలుగు క్రికెట్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


