Home Loan Interest Rates: ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇందులో పీఎన్బీ, ఎస్బీఐ సహా ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ తమ రెపో ఆధారిత రుణ రేట్లను మార్చాయి. దీంతో ఈ రేట్లకు అనుసంధానమైన హోం లోన్లపై వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంది. కొత్త రుణ గ్రహీతలు, ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు తాజా నిబంధనల్ని పరిశీలించాలి.


