హైదరాబాద్‌లో భారీ చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి షట్టర్‌ను ధ్వంసం చేసి దుండగులు షోరూమ్‌లోకి ప్రవేశించి.. సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. షోరూమ్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల కదలికలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


