ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆరోపణలు, ఓట్ల తొలగింపు వివాదం, సీఈసీ రాజీనామా వంటి డిమాండ్లతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 24న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సుమారు లక్ష మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా జాతీయ స్థాయి నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించే అంశంపై కూటమి చర్చిస్తోంది.


