HomeTELANGANAహైదరాబాద్‌లో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ.. ఈనెల 24న లక్షమంది జనసమీకరణ

హైదరాబాద్‌లో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ.. ఈనెల 24న లక్షమంది జనసమీకరణ

ఎస్ఐఆర్‌ ప్రక్రియపై ఆరోపణలు, ఓట్ల తొలగింపు వివాదం, సీఈసీ రాజీనామా వంటి డిమాండ్లతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 24న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సుమారు లక్ష మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా జాతీయ స్థాయి నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించే అంశంపై కూటమి చర్చిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments