భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ (డీపీఎస్యూ) అయిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్)తో డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.


