దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిరసనలకు, ఆందోళనలకు వేదికగా నిలిచిన ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఇకపై ఉద్యమాలకు అనుమతించరు. దీనిని నిరసన వేదికగా పోలీసులు తొలగించారు. ఈ నేపథ్యంలో సీజేపీ నేతలు దాని గేటుపైకి ఎక్కి జాతీయ జెండాలతో అందులోకి వెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు సీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. సోమవారంతో అది ముగిసింది. దీంతో మరోసారి కోర్టు ముందు వారిని హాజరుపరిచారు.


