HomeAndhra Pradeshశ్రీవారి భక్తుడి ఉదారత: ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల భారీ విరాళం

శ్రీవారి భక్తుడి ఉదారత: ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల భారీ విరాళం

శ్రీవారి భక్తుడైన నోముల అశోక్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. టీటీడీ నిర్వహించే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కోసం ఏకంగా రూ.1.02 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. శుక్రవారం స్వయంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడును కలసి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు, అశోక్ కుమార్‌ను శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కాగా ఈ ట్రస్ట్ నిధులతో నిరుపేదలకు ఉచితంగా అధునాతన వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు అందిస్తుంది. స్వీ ప్రాణదాన ట్రస్ట్ 2001 నవంబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూనే ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments