ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. తాజాగా కూటమి నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు సృష్టించిందని కూటమి నేతలు వర్ల రామయ్య, చిల్లపల్లి శ్రీనివాస్, పాతూరి నాగభూషణం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ.. ప్రతిపక్ష అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగితే కూటమి గెలుస్తుందనే భయంతోనే, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో వైసీపీ కావాలనే గొడవలు క్రియేట్ చేస్తోందని కూటమి నేతలు విమర్శించారు. కాగా ఇప్పటికే వైసీపీ నేతలు ఎన్నికల ప్రక్రియపై పలు ఆరోపణలు చేశారు.
వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన కూటమి నేతలు
RELATED ARTICLES


