హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ విసిరిన బంతి తగలడంతో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. అక్టోబర్ 17న బెంగళూరులో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20లో అతడు ఆడటంపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ స్థానంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భువీ.. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యాడు.


