భారత పర్యటనలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అదరగొడుతున్నాడు. ఏడు మ్యాచ్ల్లో 4 సెంచరీలు బాదిన హోప్ ఏకంగా 539 రన్స్ చేశాడు. మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు గెలిచిన హోప్.. ఈ ట్రోఫీలు తనకు లగేజీ సమస్య తీసుకురావచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఇచ్చిన సలహా హోప్ ఆలోచన విధానాన్ని మార్చేసింది. ఆటను అర్థం చేసుకోవడానికి ధోనీ సలహా అతడికి బాగా పనికొచ్చింది.


