భారత మహిళల క్రికెట్ దిగ్గజం, 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. టీమిండియాను మొత్తం 211 మ్యాచుల్లో ముందుండి నడిపించిన ఆమె, 2025 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ, ఆసియా క్రీడల గోల్డ్ మెడల్స్‌తో పాటు అనేక ఆసియా కప్ టైటిళ్లను అందించింది. మహిళల టీ20ల్లో అత్యధిక మ్యాచులకు (155) కెప్టెన్‌గా వ్యవహరించిన అరుదైన రికార్డును హర్మన్‌ప్రీత్ కౌర్ సాధించింది.


