భారత మాజీ బ్యాటర్ అజింక్య రహానే తన ఆల్‌టైమ్ ఇండియా టెస్ట్ లెవెన్ జట్టును ప్రకటించాడ. తాను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో కలిసి ఆడిన ఆటగాళ్లను మాత్రమే ఈ జట్టులోకి ఎంపిక చేసినట్లు అతడు తెలిపాడు. ఈ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంచుకున్న అజింక్య రహానే, తనకు తాను నంబర్ 5 బ్యాటర్‌గా స్థానం కల్పించుకున్నాడు.


