రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుండగా.. ఆ గడువును మొదట ఆగస్ట్ 31 వరకు గడువు నిర్ణయించారు. అయితే తాజాగా ఆ గడువును మరో 5 రోజుల పాటు పొడిగించారు. రేషన్ దుకాణాల వద్ద భారీగారద్దీ, రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు లబ్ధిదారులు సొంతూళ్లకు వెళ్లడం వంటి కారణాలతో చాలామంది బియ్యం తీసుకోలేకపోయారు. దీంతో పౌరసరఫరాల శాఖ బియ్యం పంపిణీ గడువును పొడిగించింది.


