వచ్చే రెండేళ్లు సహకరిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. కొడంగల్ ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రెండేళ్లు సమయం ఇస్తే.. ఇంక్రిమెంట్లు, పీఆర్సీ సహా ఉపాధ్యాయుల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. మాట తప్పితే వచ్చే ఎన్నికలలో తనకు మార్కులు వేసే నిర్ణయం కూడా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని గుర్తు చేశారు.


