ఏడాదికి రూ.46 లక్షల భారీ ప్యాకేజీతో అమెజాన్‌లో క్లౌడ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ 27 ఏళ్ల టెకీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగంతో పాటు ఎయిర్‌బస్‌లో లభించిన అవకాశాన్ని కూడా పక్కనపెట్టి భారత సైన్యంలో చేరారు. చిన్నప్పటి నుంచే సైనికుడిగా మారాలన్న తండ్రి స్ఫూర్తితో ఆర్మీ వైపు అడుగులు వేశారు. సైన్యం ఎంపిక కోసం ఏకంగా 8 సార్లు ప్రయత్నించిన ఆయన.. చివరకు టెక్నికల్ ఎంట్రీ ద్వారా ఎంపికయ్యారు. సీనియర్ అండర్ ఆఫీసర్‌గా నియమితులై, ఇప్పుడు ఆర్మీ అధికారిగా కమిషన్ కానున్నారు.
రూ.46 లక్షల ప్యాకేజీ వదిలేసి ఆర్మీలో చేరిన 27 ఏళ్ల అమెజాన్ టెకీ.. 8 ప్రయత్నాలు, దేశ సేవ కోసం గొప్ప నిర్ణయం
RELATED ARTICLES


