HomeHeadlinesరాహుల్‌ గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది.. ప్రధాని మోదీ విమర్శలకు శశిథరూర్ స్ట్రాంగ్ కౌంటర్

రాహుల్‌ గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది.. ప్రధాని మోదీ విమర్శలకు శశిథరూర్ స్ట్రాంగ్ కౌంటర్

రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు రాహుల్‌కు పెరుగుతున్న ప్రతిష్ఠను చూసి భయపడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, అందుకు తానే నిదర్శనమని ఆయన స్పష్టంగా చెప్పారు. దేశ భవిష్యత్తుకు సంబంధించి తమ పార్టీ విశ్వసించే విలువలు, సూత్రాలకు తాను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నానని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments