తమిళనాడులో మాజీ ఐపీఎస్ అన్నామలై వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనకు రాజకీయంగా గుర్తింపు తీసుకొచ్చిన కమలం పార్టీపై గత నాలుగైదు రోజులుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్దేశించుకున్న 2031 ఎన్నికల టార్గెట్‌ను ముందుకు జరిపారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో అన్నామలై వ్యూహం ఏంటి? ఆయన నిరాశలో ఉన్నారా? సీఎం విజయ్‌కు ఆయనే ప్రత్యామ్నాయమా? అనేది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.


