రాశిఫలాలు 27 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ, హస్తా నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. తులా రాశిలో బుధుడు, శుక్రుడి కలయిక జరగనుంది. మరోవైపు గురుడు, కుజుడితో కలిసి కర్కాటక రాశిలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో చంద్రుడు గురుడితో నవపంచమ యోగాన్ని ఏర్పరచనున్నారు. అంతేకాదు కర్కాటకంలో హంస రాజయోగాన్ని, శుక్రుడు తన సొంత రాశిలో మాళవ్య రాజయోగాన్ని, బుధ, శుక్రులు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ శుభ యోగాల ప్రభావంతో మిథునం, కన్య సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 27 సెప్టెంబర్ 2026: హంస, మాళవ్య రాజయోగాల వేళ మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు సూర్యదేవుని ఆశీస్సులు!
RELATED ARTICLES


