యూట్యూబ్లో వీడియోలు చూసి ఓ ఇద్దరు స్నేహితులు బంగారం వేటకు బయల్దేరారు. తీరా అక్కడికి వెళ్లాక పెద్ద సొరంగం ఉంది. ఎలాగైనా సరే బంగారం దక్కించుకోవాలన్న ఆశతో 52 ఏళ్ల వయస్సులో ఓ తాడు కట్టుకుని మరీ సొరంగంలోకి వెళ్లారు. కిందికి వెళ్లే కొద్దీ గాలి ఆడకపోవడం, కనీసం పైకి వద్దామన్నా రాలేక ఓ పెద్ద యుద్ధమే చేశారు. సొరంగంలోకి దిగిన వ్యక్తి పైకి రాలేకపోవడంతో.. పైన ఉన్న వ్యక్తి పోలీసుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అసలు విషయం చెప్పాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రావడంతో కథ సుఖాంతం అయింది. ఈ ఘటన మన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
యూట్యూబ్లో రీల్స్ చూసి.. బంగారం వేటకు వెళ్లిన 52 ఏళ్ల వ్యక్తి.. తీరా సొరంగంలోకి దిగాక..!
RELATED ARTICLES


