కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇన్‌స్టా తర్వాత తాజాగా ఎక్స్‌లోనూ అకౌంట్ ఓపెన్ చేశారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథను పరిచయం చేస్తూ తన తొలి పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీవ్ గాంధీతో తన ప్రేమకథను గుర్తుచేసుకున్నారు. కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న గ్రీక్ రెస్టారెంట్లో రాజీవ్‌తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. రాజీవ్ అందంగా ఉండటంతో పాటు ఆయన సౌమ్యమైన స్వభావం తనను ఆకర్షించిందని తెలిపారు. నవంబర్ 10న విడుదల కానున్న ఈ 544 పేజీల పుస్తకంలో ఆమె బాల్యం, కుటుంబ జీవితం, వ్యక్తిగత విషాదాలు, రాజకీయ ప్రయాణం వంటి అంశాలు ఉండనున్నాయి.
మొన్న ఇన్‌స్టా, నేడు ఎక్స్‌లో సోనియాగాంధీ ఎంట్రీ.. రాజీవ్‌గాంధీతో ప్రేమకథపై తొలిపోస్ట్
RELATED ARTICLES


