జెన్‌జీ యువతతో సమావేశమైన శ్రీశ్రీ రవిశంకర్.. వారి సందేహాలు నివృత్తి చేశారు. ఎవరికి వారే ట్రెండ్ సెట్టర్‌గా ఉండాలని హితవు పలికారు. ప్రస్తుత సోషల్ మీడియా వల్ల కలిగే ఒత్తిడితోపాటు.. ఇతరుల అభిప్రాయాలపై ఆందోళన, శరీరాకృతిపై అసంతృప్తి, ఫెయిల్యూర్‌ను ఎదుర్కోవడం వంటి అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జీవితంలో ఎదురయ్యే ఓటములను అంతిమంగా భావించకుండా, అనుభవాల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలని ప్రోత్సహించారు. యువత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ‘హనుమాన్ అంష్’ సినిమా నటీనటులు పాల్గొన్నారు.


