ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కవర్ల వాడకం మానేయడం, వాటర్ బాటిళ్లకు బదులుగా స్టీల్ బాటిళ్లు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ రోజూ ఉపయోగించే బాత్రూమ్‌లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయనే విషయం చాలామందికి తెలియదు. షాంపూ బాటిళ్లు, టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్ట్ ట్యూబులు, షేవింగ్ రేజర్లు.. ఇలా ఎన్నో వస్తువులు ప్లాస్టిక్ వ్యర్థాలను పెంచుతాయి. అయితే కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా బాత్రూమ్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు.


